9 మంది టీచర్ల ప్రాణాలు తీసిన అతివేగం 

9 మంది టీచర్ల ప్రాణాలు తీసిన అతివేగం

వరంగల్ టైమ్స్, ఇంటర్నెట్ డెస్క్ : ఒక వాహనం, మినీ బస్సు ఢీకొని రెండు వాహనాలకు మంటలంటుకున్నాయి. ఈ ప్రమాదంలో 9 మంది స్కూల్ టీచర్లతో సహా 11 మంది మరణించారు. ఇరాక్ లోని బాబిలోన్ ప్రావిన్స్ లో శుక్రవారం రాత్రి సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. షియాల పవిత్ర నగరం కర్బలాలో జరిగిన రంజాన్ విందుకు హాజరైన కొందరు మినీ బస్సులో శుక్రవారం అర్ధరాత్రి వేళ తిరిగి వస్తున్నారు.9 మంది టీచర్ల ప్రాణాలు తీసిన అతివేగం ఐతే ఎదురుగా వేగంగా వచ్చిన మరో వాహనం ఆ మినీ బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రెండు వాహనాల్లో మంటలు వ్యాపించాయి. ఈ నేపథ్యంలో బస్సులోని 9 మంది స్కూల్ టీచర్లతో సహా 11 మంది మరణించినట్లు ఇరాక్ ట్రాఫిక్ పోలీసులు పేర్కొన్నారు. మరో ఇద్దరు గాయపడినట్లు చెప్పారు. అతివేగం, ఇతర వాహనం డ్రైవర్ నిర్లక్ష్యం ఈ ప్రమాదానికి దారితీసాయని ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు.