22 జిల్లా జడ్జిల పోస్టులకు నోటిఫికేషన్ 

22 జిల్లా జడ్జిల పోస్టులకు నోటిఫికేషన్

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో 22 జిల్లా జడ్జీల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. జిల్లా జడ్జీల్లో 13 నేరుగా , మరో 9 సీనియర్ సివిల్ జడ్జిలకు నియామక పరీక్ష ద్వారా పదోన్నతి పద్ధతిలో భర్తీ చేయనున్నారు. మే 2 వరకు సీఎస్ కార్యాలయానికి దరఖాస్తులను సమర్పించాలని ప్రభుత్వం తెలిపింది.22 జిల్లా జడ్జిల పోస్టులకు నోటిఫికేషన్ కనీసం ఏడేళ్ల అనుభవం ఉన్న న్యాయవాదులు జిల్లా జడ్జి ఉద్యోగానికి అర్హులు. రాతపరీక్ష, వైవా ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. మరో 9 జిల్లా ఉద్యోగాల పదోన్నతుల ద్వారా భర్తీ చేయనున్నారు. కనీసం 5 యేండ్ల అనుభవం కలిగిన సీనియర్ సివిల్ జడ్జిలను రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేయనున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.