ఢిల్లీ క్యాపిటల్స్ ను చిత్తు చేసిన ఆర్సీబీ

ఢిల్లీ క్యాపిటల్స్ ను చిత్తు చేసిన ఆర్సీబీ

వరంగల్ టైమ్స్, స్పోర్ట్స్ డెస్క్ : టీ 20 మెగా టోర్నీలో బెంగళూరు జట్టు మరో విజయం సాధించింది. ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆల్ రౌండ్ షోతో అదరగొట్టింది. 16 పరుగుల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు , ఢిల్లీని మట్టికరిపించింది. 190 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 173 పరుగులకే పరిమితమైంది.ఢిల్లీ క్యాపిటల్స్ ను చిత్తు చేసిన ఆర్సీబీఢిల్లీ బ్యాటర్లలో ఓపెనర్ డేవిడ్ వార్నర్ ( 66 : 38 బంతుల్లో 4×4,5×6)అర్ధ శతకంతో రాణించారు. కెప్టెన్ రిషబ్ పంత్ (17 బంతుల్లో 34 పరుగులు, 3 ఫోర్లు, 2 సిక్సర్లు) ఫర్వాలేదనిపించాడు. శార్దూల్ ఠాకూర్ ( 17), ఓపెనర్ పృథ్వీ షా ( 16), మిచెల్ మార్ష్ (14), రోమన్ పావెల్ (0), లలిత్ యాదవ్ (1) విఫలమయ్యారు. అక్షర్ పటేల్ (10), కుల్దీప్ యాదవ్ (10) నాటౌట్ గా నిలిచారు. బెంగళూరు బౌలర్లలో జోష్ హేజిల్ వుడ్ మూడు వికెట్లతో దుమ్మురేపాడు. మియా బాయ్ రెండు వికెట్లతో సత్తా చాటాడు. మహమ్మద్ సిరాజ్ రెండు వికెట్లు తీశారు. వనిందు హసరంగ ఓ వికెట్ పడగొట్టాడు. ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఇది నాలుగో విజయం కాగా, ఢిల్లీ క్యాపిటల్స్ కు మూడో ఓటమి.