ఇండియన్‌ ఐడల్‌ కంటెస్టంట్ల పెర్ఫార్మెన్స్ అదుర్స్

ఇండియన్‌ ఐడల్‌ కంటెస్టంట్ల పెర్ఫార్మెన్స్ అదుర్స్

వరంగల్ టైమ్స్, సినిమా డెస్క్ : సంగీత ప్రియుల మధ్య గణనీయమైన ఆదరణ పొందిన షో తెలుగు ఇండియన్‌ ఐడల్‌ షో. స్వర మాధుర్యంతో అలరించిన ఫైనలిస్టులతో, వీనులవిందు కలిగిస్తోంది తెలుగు ఇండియన్‌ ఐడల్‌. 11 మంది టాప్‌ కంటెస్టంట్ల ప్రతిభ చూపరులను, జడ్జిలను ఇట్టే ఆకట్టుకుంటోంది. గాయనీగాయకుల పెర్ఫార్మెన్స్ లు, వాళ్లకు వచ్చే ఫీడ్‌బ్యాక్‌లతో ప్రేక్షకుల మనసులు గెలిచిన షోగా నిలిచింది తెలుగు ఇండియన్‌ ఐడల్‌. దివంగత గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం కోసం చేసిన స్పెషల్‌ మ్యూజికల్‌ ట్రిబ్యూట్‌తో పతాక శీర్షికల స్థాయికి చేరింది షో. ఈ స్పెషల్‌ ఎపిసోడ్‌ని ఏప్రిల్‌ 15,16 తేదీల్లో రాత్రి తొమ్మిది గంటల నుంచి ప్రసారం చేస్తారు.ఇండియన్‌ ఐడల్‌ కంటెస్టంట్ల పెర్ఫార్మెన్స్ అదుర్స్”నేను చాలా ఎమోషనల్‌ అయ్యాను. మరీ ముఖ్యంగా పార్టిసిపెంట్స్ ఓ ప్రియా ప్రియా పాట పాడినప్పుడు ఎమోషన్‌ ఆగలేదు. బాలుగారికి మన మనసుల్లో అత్యంత గౌరవప్రదమైన స్థానం ఉంది. ఈ ఎపిపోడ్‌ చూసిన తర్వాత ఆయన మనకు మరింతగా గుర్తుకొస్తారు” అని అన్నారు కల్పన. తెలుగు ఇండియన్‌ ఐడల్‌కి స్పెషల్‌ గెస్ట్ గా హాజరయ్యారు కల్పన. కన్యాకుమారి, అమ్మడు అప్పచి లాంటి గానగంధర్వుడి సూపర్‌హిట్‌, ఎవర్‌గ్రీన్‌ పాటలను ఆలపించారు కంటెస్టంట్‌లు. వాటితోపాటు బాలుగారితో తమకున్న అనుబంధాన్ని ఆసక్తికరంగా పంచుకున్నారు తమన్‌, కల్పన, కార్తిక్‌. ఎస్పీబీ ఒకే ఒక టేక్‌లో పూర్తి పాటను ఎలా పాడేవారు? కంపోజిషన్స్ సమయంలో పాటల లిరిక్స్ గురించి మణిశర్మ, బాలు మధ్య ఎలాంటి కాన్వర్జేషన్స్ జరిగేవి వంటి ఆసక్తికరమైన అంశాలను పంచుకున్నారు.

షోకి సోషల్‌ మీడియాలో అమితమైన స్పందన ఉండటంతో పార్టిసిపెంట్స్ కి 15 లక్షలకు పైగా ఓట్లు వచ్చాయి. ఈ వారం సెకండ్‌ ఎలిమినేషన్‌ ఉండబోతోంది. కాబట్టి, టాప్‌ 10 మంది కంటెస్టంట్లు ఎవరనే విషయం ఈ దఫా తెలిసిపోతుంది. వరల్డ్ బిగ్గెస్ట్ స్టేజ్‌ మీద తమ ప్రతిభను ప్రూవ్‌ చేసుకునే పది మంది ఎవరనే విషయం తెలుసుకోవడానికి అమితాసక్తి కనబరుస్తున్నారు ప్రేక్షకులు. అన్‌స్టాపబుల్‌, భీమ్లానాయక్‌, మోస్ట్ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌ తరహా పసందైన వినోదాన్ని అందిస్తున్న ఆహా సరికొత్త అలవాటులో తెలుగు ఇండియన్‌ ఐడల్‌ ఎప్పుడో చేరిపోయింది.