ఢిల్లీకి మరో ఓటమి..లక్నో విజయం

ఢిల్లీకి మరో ఓటమి..లక్నో విజయం

వరంగల్ టైమ్స్, స్పోర్ట్స్ డెస్క్ : ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన ఉత్కంఠ పోరులో లక్నో సూపర్ జెయింట్స్ విజయం సాధించారు. చివరి ఓవర్ లో 21 రన్స్ అవసరం కాగా, కుల్దీప్ మొదటి బాల్ కే సిక్సర్ బాదాడు. తర్వాతి బాల్ వైడ్, మరుసటి బాల్ కి సింగిల్ తీశాడు. ఆ తర్వాత మూడు బాల్స్ లలో భారీ షాట్లు ఆడేందుకు కష్టపడిన అక్షర్, ఇన్నింగ్స్ చివరి బంతికి సిక్సర్ కొట్టినా ఉపయోగం లేకపోయింది.

ఢిల్లీకి మరో ఓటమి..లక్నో విజయందీంతో లక్నో జట్టు 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇది లక్నోకు వరుసగా మూడో విజయం. దీంతో పాయింట్ల పట్టికలో ఈ జట్టు రెండో స్థానాన్ని ఆక్రమించింది. మొదట బ్యాటింగ్ చేసిన లక్నో జట్టు 3 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో వార్నర్ (3), పృథ్వీషా (5) నిరాశపరిచారు.

పంత్ (44), మిచెల్ మార్ష్ (37), రావ్ మెన్ పావెల్ (35), అక్షర్ పటేల్ ( 42 నాటౌట్), కుల్దీప్ యాదవ్ (16 నాటౌట్ ) రాణించారు. లలిత్ యాదవ్ (3), శార్దూల్ ఠాకూర్ (1) ఫెయిలయ్యారు. దీంతో ఢిల్లీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 189 పరుగులు మాత్రమే చేయగల్గింది. లక్నో బౌలర్లలో మొహ్సిన్ ఖాన్ 4 వికెట్లతో చెలరేగగా, చమీర, రవి బిష్ణోయి, కృష్ణప్ప గౌతమ్ ఒక్కో వికెట్ తీసుకున్నారు.