4న చైతన్య డీమ్డ్ టు బి వర్సిటీ స్నాతకోత్సవం
వరంగల్ టైమ్స్, హనుమకొండ జిల్లా : చైతన్య డీమ్డ్ టు బి విశ్వవిద్యాలయం స్నాతకోత్సవం ఈ నెల 4న శనివారం నిర్వహిస్తున్నట్లు యూనివర్సిటీ ఛాన్స్ లర్ డాక్టర్ సి.హెచ్.పురుషోత్తం రెడ్డి తెలిపారు. హనుమకొండ కిషన్ పురలోని చైతన్య కళాశాలలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో స్నాతకోత్సవానికి సంబంధించిన వివరాలను వారు తెలిపారు. ఈ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథులుగా భారత మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు, గౌరవ అతిథులుగా వరంగల్ నిట్ డైరెక్టర్ ఎన్.వి.రమణా రావు, మాజీ మంత్రి , బీఆర్ఎస్ నాయకులు ఇనుగాల పెద్దిరెడ్డి హాజరుకానున్నారని అన్నారు.
భారత ప్రభుత్వం తమ కళాశాలలను చైతన్య డీమ్డ్ టు బి విశ్వవిద్యాలయం స్థాయిని 2019లో ప్రకటించారని తెలిపారు. కళాశాలలకు స్వయం ప్రతిపత్తిని ప్రకటించినప్పటి నుండి ప్రతీ యేడాది విద్యార్థులకు సకాలంలో ఉత్తీర్ణతా పట్టాలను ఎలాంటి ఇబ్బందులు కలగకుండా స్నాతకోత్సవాలు నిర్వహించి వారికి అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ మీడియా సమావేశంలో వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ దామోదర్, వైస్ ప్రెసిడెంట్ విక్రమ్ రెడ్డి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ రవీందర్, అసిస్టెంట్ రిజిస్ట్రార్ గాదె రాంబాబు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.