దాస్యం ఆధ్వర్యంలో బీజేపీకి నిరసన సెగలు

దాస్యం ఆధ్వర్యంలో బీజేపీకి నిరసన సెగలు

వరంగల్ టైమ్స్, హనుమకొండ జిల్లా : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు కేంద్ర ప్రభుత్వానికి నిరసన సెగలు అంటించారు. పెరిగిన గ్యాస్ ధరలను నిరసిస్తూ ప్రతీ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరిగాయి. ఇందులో భాగంగానే వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ ఆధ్వర్యంలో హనుమకొండ కలెక్టరేట్ ఎదుట పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహించారు. గ్యాస్ సిలిండర్ ధరను పెంచిన కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ వంటా వార్పు కార్యక్రమం నిర్వహించి, పెద్ద ఎత్తున నిరసన తెలిపారు.దాస్యం ఆధ్వర్యంలో బీజేపీకి నిరసన సెగలుకేంద్ర ప్రభుత్వం గత ఎనిమిదేండ్లుగా ప్రజా వ్యతిరేక చర్యలకు పాల్పడుతూ రైతు వ్యతిరేక చట్టాలు అమలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి ప్రజలు బుద్ది చెప్తారని దాస్యం వినయ్ భాస్కర్ హెచ్చరించారు. పెట్రోల్ ధరలు పెంచడం, కార్మిక వ్యతిరేక చట్టాలు తెర తీయడం, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయడం బీజేపీ ప్రభుత్వానికి అలవాటైపోయిందని ఎద్దేవా చేశారు. మోడీ ప్రభుత్వం రాకముందు రూ.400 ఉన్న సిలిండర్ ధర మోడీ ప్రభుత్వం వచ్చాక నేడు రూ.1160ని దాటి రూ.1200లకు చేరుకోవడం సిగ్గు చేటన్నారు.

ఇప్పటికే నిత్యావసర సరుకుల ధరలు పెంచిన మోడీ ప్రభుత్వం చీటికి మాటికి గ్యాస్ సిలిండర్ ధరలు పెంచుతూ సామాన్యుపై భారాన్ని మోపుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్చి 8 మహిళా దినోత్సవం సందర్భంగా దేశ మహిళలకు ప్రధాని మోడీ ఇచ్చిన కానుక గ్యాస్ సిలిండర్ ధర పెంపు అంటూ దాస్యం వినయ్ భాస్కర్ కు మోడీకి చుకలంటించారు. కేంద్ర ప్రభుత్వం గాస్ ధరను తగ్గించే వరకు ఇలాంటి నిరసనలు కొనసాగుతూనే ఉంటాయని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో జీడబ్ల్యూఎంసీ మేయర్ గుండు సుధారాణి, కూడా చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్, నియోజకవర్గ కార్పొరేటర్లు , మహిళలు, స్థానికులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ప్లకార్డులతో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.