భారత్ కు చేజారిన మూడో టెస్ట్

భారత్ కు చేజారిన మూడో టెస్ట్

భారత్ కు చేజారిన మూడో టెస్ట్వరంగల్ టైమ్స్, స్పోర్ట్స్ డెస్క్ : బోర్డర్-గవాస్కర్ సిరీస్ లో బోణి కొట్టిన ఆసిస్ తొలి రెండు మ్యాచుల్లో ఓటమి పాలై ట్రోఫీ చేజార్చుకుంది. శుక్రవారం ముగిసిన మూడో టెస్టులో 9 వికెట్ల తేడాతో టీం ఇండియా పై ఘన విజయం సాధించింది. 76 పరుగుల లక్ష్యఛేదనకు మూడో రోజు రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన కంగారూలు 18.5 ఓవర్లలో పని పూర్తి చేశారు.

ఈ సక్సెస్ తో ఆసీస్ నేరుగా డబ్ల్యూటీసీ ఫైనల్ కు అర్హత సాధించగా, భారత్ కు అవకాశాలు క్లిష్లమయ్యాయి. సిరీస్ లో భాగంగా ఈ నెల 9 నుంచి అహ్మదాబాద్ వేదికగా ప్రారంభంకానున్న నాలుగో టెస్టులో విజయం సాధిస్తే, రోహిత్ సేన డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్ దక్కించుకోవడంతో పాటు ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో అగ్రస్థానానికి చేరనుంది.