23న టీడీపీలో చేరనున్న మాజీ మంత్రి కన్నా

23న టీడీపీలో చేరనున్న మాజీ మంత్రి కన్నా

23న టీడీపీలో చేరనున్న మాజీ మంత్రి కన్నా

వరంగల్ టైమ్స్, గుంటూరు : బీజేపీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఈ నెల 23న టీడీపీలో చేరనున్నారు. బీజేపీకి ఈ నెల 16న మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ రాజీనామా చేశారు. బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వైఖరి నచ్చక బీజేపీకి గుడ్ బై చెబుతున్నట్టుగా కన్నా లక్ష్మీనారాయణ ప్రకటించారు. బీజేపీకి రాజీనామా చేయడానికి ముందే కొందరు టీడీపీ నాయకులతో కన్నా లక్ష్మీనారాయణ చర్చలు జరిపినట్టుగా ప్రచారం సాగింది.