కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న కన్నుమూత

కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న కన్నుమూత

కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న కన్నుమూతవరంగల్ టైమ్స్,హైదరాబాద్ : సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే జి.సాయన్న కన్నుమూశారు. కొంతకాలంగా కిడ్నీ, గుండె సమస్యతో బాధపడుతున్నారు. షుగర్ లెవల్స్ పడిపోవడంతో కుటుంబసభ్యులు సాయన్నను యశోద ఆస్పత్రికి తరలించారు. యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నేడు సాయన్న కన్నుమూశారు.

సాయన్నకు భార్య, ముగ్గురు కుమారులు, కూతురు ఉన్నారు. 1951 మార్చి లో చిక్కడపల్లిలో జన్మించారు. ఇప్పటి వరకు సాయన్న 5 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. సాయన్న 2014లో టీడీపీ తరపున, 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు.