లోయలోకి దూసుకెళ్లిన బైక్..ముగ్గురు మృతి 

లోయలోకి దూసుకెళ్లిన బైక్..ముగ్గురు మృతి లోయలోకి దూసుకెళ్లిన బైక్..ముగ్గురు మృతి వరంగల్ టైమ్స్, అమరావతి : అల్లూరి సీతరామరాజు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి చెందారు. అనంతగిరి మండలం బూర్జ గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు రాత్రి బొర్రా గుహల్లో శివరాత్రి వేడుకలు తిలకించారు. ఇక తిరిగి వస్తుండగా అనంతగిరి మండలంలోని లుంగుపర్తి వద్ద వీరు ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనం ప్రమాదవశాత్తు లోకలోకి దూసుకెళ్లింది. దీంతో ముగ్గురు యువకులకు తీవ్రగాయాలై దుర్మరణం చెందారు.

విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వారు వెల్లడించారు.