54 చైనా యాప్ లపై కేంద్రప్రభుత్వం నిషేధం

54 చైనా యాప్ లపై కేంద్రప్రభుత్వం నిషేధంవరంగల్ టైమ్స్, న్యూఢిల్లీ : దేశ భద్రతకు సమస్య ఉన్న నేపథ్యంలో 54 చైనా యాప్ లను నిషేధించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నది. నిషేధిత జాబితాలో స్వీట్ సెల్పీ హెడ్, బ్యూటీ కెమెరా-సెల్ఫీ కెమెరా, వివా వీడియో ఎడిటర్, టెన్ సెంట్ జీవర్, ఒన్ మోజీ ఎరినా, యాప్ లాక్ , డ్యుయల్ స్పేస్ లైట్ యాప్ లు ఉన్నట్లు తెలుస్తోంది. గత యేడాది జూన్ లో చైనాకు చెందిన 59 మొబైల్ అప్లికేషన్లను బ్యాన్ చేసిన విషయం తెలిసిందే. వాటిల్లో పాపులర్ యాప్ లైన టిక్, వీచాట్, హలో కూడా ఉన్నాయి. జాతీయ భద్రతకు, సార్వభౌమాధికారినికి ముప్పు ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. 2020 మేలో చైనాతో సరిహద్దు ఘర్షణ మొదలైన తర్వాత ఇప్పటి వరకు 300 యాప్ లను నిషేధించారు. గాల్వాన్ ఘర్షణ తర్వాత ఆ యేడాది జూన్ లో తొలిసారి చైనీస్ యాప్ లను బ్యాన్ చేశారు.