జంగారెడ్డి కుటుంబానికి జాతీయ నేతల పరామర్శ

జంగారెడ్డి కుటుంబానికి జాతీయ నేతల పరామర్శ

వరంగల్ టైమ్స్, హనుమకొండ జిల్లా: ఇటీవల మరణించిన బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ చందుపట్ల జంగారెడ్డి కుటుంసభ్యులను బీజేపీ రాష్ట్ర, జాతీయ స్థాయి నేతలు పరామర్శించేందుకు తరలివస్తున్నారు. బీజేపీ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి శ్రీరామ్ మాధవ్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు, మాజీ మంత్రి డీకే అరుణ, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుమారి బంగారు శృతి, రాష్ట్ర నాయకులు శ్రీవర్ధన్ రెడ్డి, రాజ వర్ధన్ రెడ్డి తదితరులు హనుమకొండలోని చందుపట్ల జంగారెడ్డి నివాసానికి వెళ్లారు. జంగారెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. జంగారెడ్డి కుటుంబసభ్యులను పరామర్శించి, ప్రగాఢ సంతాపం తెలిపారు. జంగారెడ్డి లాంటి వ్యక్తిని కోల్పోవడం చాలా బాధాకరమని అన్నారు. జంగారెడ్డి కుటుంబసభ్యులను పరామర్శించిన వారిలో వీరి వెంట బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ, జిల్లా నాయకులు తదితరులు ఉన్నారు. మొన్నటి మొన్న గవర్నర్ బండారు దత్తాత్రేయ కూడా జంగారెడ్డి కుటుంబసభ్యులను నేరుగా కలిసి పరామర్శించారు. జంగారెడ్డికి నివాళులర్పించి, వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.