వరంగల్ లో రికార్డు పలికిన మిర్చి ధర

వరంగల్ లో రికార్డు పలికిన మిర్చి ధరవరంగల్ టైమ్స్, వరంగల్ జిల్లా : మిర్చి రైతులకు కాసుల పంట పండింది. వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ లో దేశీ మిర్చికి రికార్డు ధర పలికింది. క్వింటాల్ మిర్చి రూ.27వేలతో రికార్డ్ సృష్టించింది. కాగా, మార్కెట్ చరిత్రలో మునుపెన్నడూ ఈ ధర నమోదు కాలేదని వ్యాపారులు చెబుతున్నారు. ఆరుగాలం శ్రమించిన రైతులకు రికార్డు ధర పలుకడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.