మేడారం జాతర మిస్సైన వారికి గుడ్ న్యూస్

మేడారం జాతర మిస్సైన వారికి గుడ్ న్యూస్వరంగల్ టైమ్స్, ములుగు జిల్లా : మేడారం సమ్మక్క -సారలమ్మ జాతరలో భక్తుల సౌకర్యార్థం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త నిర్ణయాన్ని తీసుకుంది. అనివార్య కారణాల వల్ల జాతరకు హాజరుకాని భక్తులు నిరాశ చెందకుండా సమ్మక్క సారలమ్మ జాతర ప్రసాదంను ‘మీ సేవ’ ద్వారా అందించేలా ఏర్పాట్లు చేసింది. ఇట్టి విషయాన్ని ఈ-సేవ జిల్లా మేనేజర్ శ్రీధర్ తెలిపారు. భక్త్తులు తమ సమీపంలోని మీ సేవా కేంద్రంలో రూ. 225 చెల్లిస్తే, కొరియర్ ద్వారా నేరుగా ఇంటికే సమ్మక్క సారలమ్మ జాతర ప్రసాదంను పంపించడం జరుగుతుందన్నారు. భక్తులు చెల్లించే రూ.225లో ప్రసాదం ధర 190 రూపాయలు కాగా, సేవా రుసుము కింద 35 రూపాయలు మాత్రమే తీసుకోవడం జరుగుతుందని అన్నారు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.