టెడ్డీ బేర్ లో హెరాయిన్

టెడ్డీ బేర్ లో హెరాయిన్
బెంగుళూరు: టెడ్డీ బేర్ బొమ్మలోపల యాటా టాబ్లెట్లు, హెరాయిన్ పౌడర్ ను అక్రమంగా రవాణా చేస్తున్న క్యాబ్ డ్రైవర్ ను బెంగుళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు తన భార్యా, పిల్లలతో అసోం వెళ్లి , అక్కడ బంగ్లాదేశ్ నుంచి రవాణా అయిన మాదకద్రవ్యాలను టెడ్డీ బేర్ లో నింపి తన పిల్లలకు అప్పగించాడు. డిసెంబర్ 3 సాయంత్రం 4గం.20 నిమిషాల సమయంలో ఓల్డ్ మద్రాస్ రోడ్ లోని ఎంవీ గార్డెన్ లోని చెక్ పాయింట్ సమీపంలో అనుమానాస్పదంగా కనిపించిన చౌదరి క్యాబ్ ను ఉల్సూరు పోలీసులు అడ్డగించారు. దీంతో ఒక్కసారిగా బెంబేలెత్తిన కారు డ్రైవర్ టెడ్డీ బేర్ ను దాచడానికి తీవ్రంగా ప్రయత్నించడంతో పోలీసులు అనుమానించి తనిఖీ చేశారు. కారులో లభించిన టెడ్డీ బేర్ ను తనిఖీ చేయగా డ్రగ్స్ బయటపడ్డాయి. నిందితుడు క్యాబ్ డ్రైవర్ ఉల్సూరు గ్రామానికి చెందిన సకీర్ హుస్సేన్ చౌదరిగా పోలీసులు గుర్తించారు. అతన్ని అదుపులోకి తీసుకుని, రూ.22లక్షల విలువైన 2,200 యాబా టాబ్లెట్లు, రూ.6లక్షల విలువైన 71 గ్రాముల హెరాయిన్ పౌడర్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.