ఈనెల 09 వరకు దోస్త్ ధృవీకరణ పత్రాల సమర్పణ

హైదరాబాద్ : దోస్త్ ద్వారా ప్రవేశానికి ధృవీకరణ పత్రాలు సమర్పించడానికి చివరి తేదీ పొడిగించబడింది. దోస్త్ ద్వారా డిగ్రీలో ప్రవేశాలు పొందిన అభ్యర్థులు సెల్ఫ్ రిపోర్టింగ్, కేటాయించిన కాలేజీలలో రిపోర్టింగ్ చేయడం, ధృవీకరణ పత్రాలు సమర్పించడాన్ని డిసెంబర్ 9వ తేదీ వరకు పొడిగిస్తూ తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఆదేశాలు జారీ చేసింది. విద్యార్ధులు, తల్లిదండ్రులు అభ్యర్ధన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీ.ఎస్.సీ.హెచ్.ఈ. ఓ ప్రకటనలో తెలిపింది. దోస్త్ స్పెషల్ డ్రైవ్ ద్వారా 14వేల247 మంది అభ్యర్థులు ప్రవేశాలు పొందారు. అంతకు ముందు చేపట్టిన దశల్లో మొత్తం 28వేల136 మంది అభ్యర్థులు ఆప్షన్లు ఇవ్వగా వీరిలో 27వేల 365 మందికి సీట్లు కేటాయించబడ్డాయి.