భూమి విలువ‌ల పెంపుద‌లను వాయిదా వేయాలి!

భూమి విలువ‌ల పెంపుద‌లను వాయిదా వేయాలి!హైదరాబాద్ : ఫిబ్ర‌వ‌రి 1 నుంచి భూముల మార్కెట్ విలువ‌ల్నిపెంచాల‌న్న ప్ర‌భుత్వం నిర్ణ‌యాన్ని తెలంగాణ నిర్మాణ సంఘాలు తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నాయి. స్టేక్ హోల్డ‌ర్లు ( వాటాదారులు) , ప్ర‌జ‌ల అభిప్రాయాల్ని తెలుసుకోకుండా రాష్ట్ర రియ‌ల్ రంగంలో నెల‌కొన్న‌ స‌మ‌స్య‌ల్ని ప‌ట్టించుకోకుండా తీసుకుంటున్న ఈ నిర్ణ‌యాన్ని కొంత‌కాలం పాటు వాయిదా వేయాల‌ని అభ్య‌ర్థిస్తున్నాయి.
ఇందుకు సంబంధించి ఇప్పటికే ట్రెడా, క్రెడాయ్ హైదరాబాద్‌, క్రెడాయ్ తెలంగాణ నిర్మాణ సంఘాలు.. రాష్ట్ర మంత్రులు కేటీఆర్‌, హ‌రీష్ రావు, వేముల ప్ర‌శాంత్ రెడ్డితో పాటు ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేష్ కుమార్ త‌దిత‌రుల‌కు విన‌తి ప‌త్రాన్ని అంద‌జేశాయి. నాలుగైదు నెల‌ల్నుంచి యూడీఎస్‌, ప్రీలాంచుల వ‌ల్ల హైదరాబాద్ రియ‌ల్ మార్కెట్ తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంటుంద‌ని వివ‌రించాయి.