మేడారం జాతర ట్రస్ట్ బోర్డ్ మెంబర్ల నియామకం

మేడారం జాతర ట్రస్ట్ బోర్డ్ మెంబర్ల నియామకంహైదరాబాద్ : ఆసియా ఖండంలోనే అతిపెద్దదైన మేడారం సమ్మక్క, సారలమ్మ గిరిజన జాతర నిర్వహణ కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్థానికులతో అభివృద్ధి కమిటీని ఏర్పాటు చేసింది. అక్కడి గిరిజన భక్తులు, ఆలయ పూజారులతో కలిపి 14 మందితో కమిటీని నియమిస్తూ దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 29న దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి సమక్షంలో కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే ఎప్పటిలాగే వనదేవతల జాతర శాశ్వత డోనర్ గా వ్యవహరిస్తున్న ప్రముఖ వ్యాపారవేత్త , టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వద్దిరాజు రవిచంద్ర ( గాయత్రి రవి )కి కమిటీలో మళ్లీ చోటు కల్పించారు.

ఈ కమిటీలో సభ్యుల పేర్ల వివరాలు..
1. కోర్నిబెల్లి శివయ్య
2. సప్పిడి వెంకట్రాంనర్సయ్య
3. చిలకమర్రి రాజెందర్
4. లకావత్ చందూలాల్
5. వట్టం నాగరాజు
6. బండి వీరాస్వామి
7. సనికొమ్ము ఆదిరెడ్డి
8. నక్క సాంబయ్య
9. జేటీవీ సత్యనారాయణ
10. తండా రమేష్
11. పొడెం శోభన్
12. వద్దిరాజు రవిచంద్ర
13. అంకం క్రిష్ణస్వామి
14. సిద్దబోయిన జగ్గారావు

తెలంగాణ మహా కుంభమేళాగా ప్రసిద్ధిగాంచి దేశ నలుమూలల నుంచి లక్షలాది ప్రజలు సమ్మక్క, సారలమ్మ అమ్మవార్లను దర్శించుకుని కోరిన కోర్కెలు తీర్చమని వివిధ రూపాల్లో మొక్కులు తీర్చుకుంటుంటారు. అలాంటి మహత్తర జాతరకు శాశ్వత డోనర్ గా ఉంటూ ఎనలేని సేవలు చేసిన గాయత్రి గ్రానైట్స్ సంస్థ అధినేత వద్దిరాజు రవిచంద్రకి ఈ అవకాశం దక్కడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.