ధరణిలో న్యూ మాడ్యూల్స్ కు కసరత్తు
వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : ధరణి పోర్టల్ లో నూతన మాడ్యూల్స్ ను ప్రవేశపెట్టేందుకు తెలంగాణ సర్కార్ అనుమతి ఇచ్చింది. భూ లావాదేవీలకు సంబంధించి టెక్నికల్ గా ఎదురవుతున్న సమస్యలను అధిగమించేందుకు నూతన మాడ్యూల్స్ అవసరమని భూ పరిపాలన ప్రధాన కమిషనర్ ( సీసీఎల్ ఏ) ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. దీన్ని సమగ్రంగా పరిశీలించిన అనంతరం నూతన మాడ్యూల్స్ ఏర్పాటుకు అనుమతి ఇస్తూ రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
దీంతో పాటు ధరణికి ముందు ‘కార్డ్’ వ్యవస్థ అమల్లో ఉన్న సమయంలో జరిగిన అగ్రిమెంట్ ఆఫ్ సేల్ కమ్ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ (ఏజీపీఏ), స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీ (ఏఎస్పీఏ) లకు సంబంధించి, స్టాంపు డ్యూటీని సవరించేందుకు అనుమతి ఇచ్చారు.