వరంగల్ టైమ్స్, ముంబై : కరోనాతో కన్నుమూసిన భారతరత్న లతా మంగేష్కర్ అంత్యక్రియలు ముగిశాయి. ముంబైలోని శివాజీ పార్కులో అధికారిక లాంఛనాల మధ్య జరిగిన అంత్యక్రియలకు ప్రధాని నరేంద్ర మోదీ సహా ఇతర ప్రముఖులు వేలాది మంది అభిమానులు హాజరయ్యారు. అంతకు ముందు నివాసం నుంచి శ్మశానవాటిక వరకు జరిగిన అంతిమయాత్రలో కూడా వేలాది మందిగా అభిమానులు పాల్గొని అభిమాన గాయనికి కడసారి వీడ్కోలు పలికారు.
Home News
Latest Updates
