ఆసీస్ ను ఓడించి ఫైనల్ కు దూసుకెళ్లిన టీమిండియా

ఆసీస్ ను ఓడించి ఫైనల్ కు దూసుకెళ్లిన టీమిండియావరంగల్ టైమ్స్, స్పోర్ట్స్ డెస్క్ : అండర్-19 వరల్డ్ కప్ లో టీం ఇండియా అదరగొట్టింది. సెమీస్ లో ఆస్ట్రేలియాను 96 రన్స్ తేడాతో ఓడించి ఫైనల్ కు దూసుకెళ్లింది. ఇక చివరి పోరాటంలో ఇంగ్లాండ్ తో పోటీపడటమే తరువాయి. అంటిగ్వా వేదికగా జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ లో మొదట భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టింది. 37 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి తడబాటుకు గురైంది. భారత్ స్కోర్ 40 ఓవర్లకు 182 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. అయితే చివరి 10 ఓవర్లలో భారత ఆటగాళ్లు 108 పరుగులు చేసి ఊహించని టార్గెట్ ను ప్రత్యర్థి ఎదుట ఉంచింది. దీంతో భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 290 పరుగులు చేసింది.

అనంతరం 291 రన్స్ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ ఏ మాత్రం పోటీనివ్వలేకపోయింది. 3 రన్స్ కే తొలి వికెట్ కోల్పోయి ఆ జట్టు ఆ తర్వాత నెమ్మదిగా ఇన్నింగ్స్ ను నిర్మించింది. ఈ క్రమంలో డేంజర్ జోన్ లో కోరె మిల్లర్ ( 38), క్యాంప్ బెల్ ( 30) జోడీని రఘువంశీ విడగొట్టాడు. దీంతో 71 రన్స్ వద్ద ఆసీస్ రెండో వికెట్ కోల్పోయింది. అనంతరం స్వల్ప వ్యవధిలోనే 73 రన్స్ వద్ద మూడో వికెట్ గా క్యాంప్ బెల్ ఓటవి చవిచూశాడు.

ఇక అక్కడి నుంచి ఆస్ట్రేలియా పతనం ప్రారంభమైంది. క్రమం తప్పకుండా టీమిండియా బౌలర్లు వికెట్లు తీస్తూ కంగారూలపై ఒత్తిడి తీసుకొచ్చారు. ఈక్రమంలో 125 పరుగులకే ఆసీస్ 7 వికెట్లు కోల్పోయి చాలా కష్టాల్లో పడింది. ఈ శతకంతో జట్టు సక్సెస్ లో కీలక పాత్ర పోషించిన కెప్టెన్ యశ్ ధూల్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ గా ఎంపికయ్యాడు.