ఎమ్మెల్యే కొడుకుతో సహా ఏడుగురు మృతి

ఎమ్మెల్యే కొడుకుతో సహా ఏడుగురు మృతిమహారాష్ట్ర : వార్ధా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో ఒక ఎమ్మెల్యే కొడుకుతో సహా మొత్తం ఏడుగురు మరణించారు. దీంతో ఆ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఈ ఘటన సోమవారం అర్థరాత్రి యావత్మాల్, వార్ధా రోడ్డుపై సంభవించింది. కాగ మహారాష్ట్ర సావంగిలోని మెడికల్ కాలేజీలో చదువుతున్న విద్యార్థులు కారులో యావత్మాల్ – వార్ధా రోడ్డులో ప్రయాణిస్తున్నారు. వార్ధా రోడ్డులో సెల్సురా గ్రామం వద్ద వీరు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి వంతెనపై నుంచి కింద పడింది.

కారులో ప్రయాణిస్తున్న వారిలో గోండియా జిల్లా తిరోడా ఎమ్మెల్యే విజయ్ రహంగ్ డేల్ కుమారుడు ఆవిష్కార్ రహంగ్ డెల్ సహా మొత్తం ఏడుగురు మృతి చెందారు. అయితే వంతెన దాదాపు 50 అడుగుల లోతు ఉండటంతో ప్రమాద తీవ్రత పెరిగింది. కాగా, ఈ రోడ్డు ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.