కంటి వెలుగును సద్వినియోగించుకోండి : సీపీ
వరంగల్ టైమ్స్, హనుమకొండ జిల్లా : వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు కార్యక్రమాన్ని వరంగల్ పోలీస్ కమిషనర్ ఏ.వి.రంగనాథ్ గురువారం ప్రారంభించారు. పోలీస్, హోంగార్డ్స్ సిబ్బంది సంక్షేమాన్ని దృష్టిలో వుంచుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభంచిన కంటి వెలుగు కార్యక్రమాన్ని వరంగల్ పొలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది. నేటి నుండి రెండు రోజుల పాటు నిర్వహించబడే ఈ కార్యక్రమములో పోలీసు సిబ్బందికి నిర్వహిస్తున్న కంటి పరీక్షల నిర్వహణ తీరుతెన్నులపై పోలీస్ కమిషనర్ సంబంధిత అధికారులు, కంటి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పోలీస్ కమిషనర్ చేతుల మీదుగా సిబ్బందికి కంటి అద్దాలు, మందులను అందజేశారు.
నిరంతరం విధులు నిర్వహించే పోలీస్ సిబ్బంది తమ ఆరోగ్యం పట్ల వ్యక్తిగత శ్రద్ధ అవసరమని, ముఖ్యంగా కంటి సమస్యల పట్ల అశ్రద్ధ వహించవద్దని సీపీ రంగనాథ్ సూచించారు. ముఖ్యంగా సిబ్బంది, వారి కుటుంబాల్లో కంటి సమస్యలు బాధపడుతున్న కుటుంబ సభ్యులకు కంటి వెలుగు కార్యక్రమము ద్వారా పరీక్షలు నిర్వహించుకోవాలని పోలీస్ కమిషనర్ సిబ్బందికి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమములో సెంట్రల్ డిసిపి ఏ బారి, అదనపు డిసిపి సంజీవ్,జిల్లా వైద్యాధికారి సాంబశివరావు,ఉప వైద్యాధికారులు డాక్టర్లు చొక్కయ్య, మదన్మోహన్ ఏసిపి నాగయ్య, ఆర్.ఐలు నగేష్, భాస్కర్,యూనిట్ డాక్టర్ విద్యారెడ్డితో పాటు ఇతర పోలీస్, వైద్య సిబ్బంది పాల్గోన్నారు.