దానిపై కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేస్తా : కోటంరెడ్డి 

దానిపై కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేస్తా : కోటంరెడ్డి 

వరంగల్ టైమ్స్, అమరావతి : ఫోన్ ట్యాపింగ్‌పై కేంద్రహోంశాఖకు ఫిర్యాదు చేశానని ఎమ్మెల్యే కోటంరెడ్డి అన్నారు. రాష్ట్రంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అభద్రతాభావంలో ఉన్నారు. ఫోన్లు మాట్లాడుకునే ధైర్యం చేయలేకపోతున్నారన్నారు. విచారణ జరిపితే మిగిలినవారి ట్యాపింగ్ బయటపడుతుందన్నారు. సజ్జల నా మిత్రుడికి ఇవ్వాల్సిన స్క్రిప్ట్ సరిగా ఇవ్వలేకపోయారు. కేంద్రహోంశాఖను విచారణ కోరేందుకు ఎందుకు వెనుకాడుతున్నారని ఎద్దేవా చేశారు. మరో 6 నెలల తర్వాత చిత్రవిచిత్రాలు చూస్తారని హెచ్చరించారుఎమ్మెల్యే కోటంరెడ్డి.