సూర్యలంక బీచ్ లో మంత్రి ఆర్కే రోజా

సూర్యలంక బీచ్ లో మంత్రి ఆర్కే రోజా

సూర్యలంక బీచ్ లో మంత్రి ఆర్కే రోజా

వరంగల్ టైమ్స్, సూర్యలంక : బాపట్ల సూర్యలంక బీచ్ ని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక క్రీడలు మరియు యువజనాభివృద్ది శాఖా మంత్రి ఆర్కే రోజా సందర్శించారు. బాపట్ల బీచ్ లో కాసేపు ఎంజాయ్ చేశారు. అద్భుతమైన పర్యాటక ప్రాంతమైన సూర్యలంకబీచ్ ను మరింతగా అభివృద్ధి చేసి, పర్యాటకులను అమితంగా ఆకర్షించెలా ఏర్పాట్లు చేయాలని పర్యాటక శాఖా అధికారులను మంత్రి రోజా ఆదేశించారు. సూర్యలంకబీచ్ కి విచ్చేసిన మంత్రిని బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి మర్యాదపూర్వకంగా కలిసారు.

అనంతరం సూర్యలంక పర్యాటక ప్రదేశాలపై టూరిజం శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సమీక్షలో ఎమ్మెల్యే కోన రఘుపతి పాల్గొన్నారు. సూర్యలంక బీచ్ హరిత రిసార్ట్ లను మరింతగా అభివృద్ధి చేయాలని, ప్రస్తుతం ఉన్న రిసార్ట్ లను రెనువేట్ వేగంగా చేయాలని మంత్రి ఆదేశించారు. బీచ్ కి దగ్గరలోని 8 ఎకరాల స్థలాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో టూరిజం ఈడి మల్రెడ్డి, డివిజనల్ మేనేజర్ శ్రీనివాస్, ఆర్డీ, ఆర్డీవో, డిఎస్పీ, టూరిజం శాఖా అధికారులు పాల్గొన్నారు.