3న రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చిన కేటీఆర్

3న రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చిన కేటీఆర్

3న రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చిన కేటీఆర్

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ఎన్నికలు అయిపోయిన వెంటనే ప్రతీసారి గ్యాస్ సిలిండర్ ధరలను పెంచడం కేంద్ర ప్రభుత్వానికి ఆనవాయితీగా మారిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. తాజాగా కేంద్రం భారీగా గ్యాస్ సిలిండర్ ధరలను పెంచడంపై కేటీఆర్ మండిపడ్డారు. కేంద్రం గ్యాస్ సిలిండర్ ధరలను పెంచిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 3న నిరసన కార్యక్రమాలు చేపట్టాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా అధ్యక్షులతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.

టెలీ కాన్ఫరెన్స్ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం గృహ అవసరాల సిలిండర్ ధరను రూ.50, కమర్షియల్ సిలిండర్ ధరను రూ. 350 పెంచిందని గుర్తు చేశారు. అటు ఆయా రాష్ట్రాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్న వెంటనే ఈ రోజు ఇంత భారీగా సిలిండర్ ధరను పెంచడం దారుణమన్నారు.