కొండగట్టు అంజన్న సన్నిధిలో హరీష్ రావు దంపతులు

కొండగట్టు అంజన్న సన్నిధిలో హరీష్ రావు దంపతులు

వరంగల్ టైమ్స్, జగిత్యాల జిల్లా : జగిత్యాల జిల్లాలోని ప్రముఖ ఆలయం కొండగట్టు అంజన్నను మంత్రి హరీష్ రావు దర్శించుకున్నారు. సతీసమేతంగా ఆలయానికి చేరుకున్న మంత్రి హరీష్ రావు ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు చేశారు.కొండగట్టు అంజన్న సన్నిధిలో హరీష్ రావు దంపతులుఅంతకు ముందు ఆలయ ఈవో, ప్రధాన అర్చకులు పూర్ణకుంభంతో మంత్రికి స్వాగతం పలికారు. దర్శనానంతరం హరీష్ రావు దంపతులకు అర్చకులు వేదాశీర్వచనం అందచేశారు. మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలు సంజయ్ కుమార్, రవి శంకర్ కూడా స్వామివారిని దర్శించుకున్నారు.