శ్రీవారి ఆలయంలో విశేష ఉత్సవాలు 

శ్రీవారి ఆలయంలో విశేష ఉత్సవాలు

వరంగల్ టైమ్స్, తిరుమల : తిరుమల శ్రీవారి ఆలయంలో మే నెలలో జరుగనున్న విశేష ఉత్సవాల వివరాలను టీటీడీ అధికారులు ప్రకటించారు. మే 5న శ్రీ రామానుజ జయంతి, భాష్యకార్ల సాత్తుమొర, శ్రీ అనంతాళ్వార్ ఉత్సవారంభం, మే 6న శ్రీ శంకరాచార్య జయంతి, మే 10 నుంచి 12 వరకు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. నారాయణగిరి ఉద్యానవనాల్లోని పరిణయోత్సవ మండపంలో మూడ్రోజుల పాటు వైభవంగా నిర్వహిస్తామన్నారు.శ్రీవారి ఆలయంలో విశేష ఉత్సవాలు ఈ వేడుకలో మొదటి రోజు శ్రీ మలయప్పస్వామి వారు గజవాహనం, రెండవ రోజు అశ్వవాహనం, చివరి రోజు గరుడవాహనంపై వేంచేపు చేస్తారు. మే 13న శ్రీ నృసింహ జయంతిని, 14న శ్రీ అనంతాళ్వార్ సాత్తుమొర వైభవంగా నిర్వహించనున్నామని తెలిపారు. 15న శ్రీ తరిగొండ వెంగమాంబ జయంతి, మే 16న శ్రీ అన్నమాచార్య జయంతి, 25న శ్రీ హనుమజ్జయంతిని నిర్వహిస్తున్నట్లు వివరించారు.