మేడారంలో కేసీఆర్ బర్త్ డే వేడుకలు

మేడారంలో కేసీఆర్ బర్త్ డే వేడుకలువరంగల్ టైమ్స్, ములుగు జిల్లా: మేడారం సమ్మక్క, సారలమ్మ వనదేవతలను రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గురువారం దర్శించుకున్నారు. కేసీఆర్ బర్త్ డేను పురస్కరించుకుని ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని వనదేవతలను కోరుకున్నట్లు మంత్రి తెలిపారు. కోరిన కోర్కెలు తీర్చే వనదేవతలను దర్శించుకోవడం సంతోషంగా ఉందని మంత్రి ఎర్రబెల్లి అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సమ్మక్క, సారలమ్మ దీవెనలతో అభివృద్ధి పథంలో నిలుపుతున్న సీఎం కేసీఆర్ కు అమ్మల కృప ఉండాలని కోరుకున్నానన్నారు. సీఎం కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ తన ఎత్తు బంగారాన్ని వనదేవతలకు సమర్పించారు. అనంతరం భారీ కేక్ కట్ చేసి కేసీఆర్ బర్త్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి దయాకర్ రావుతో పాటు టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, మేడారం శాశ్వత డోనర్ వద్దిరాజు రవిచంద్ర, టీఆర్ఎస్ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.