మేడారం సన్నిధిలో చత్తీస్ ఘడ్ మంత్రి కవాసి లక్మా

మేడారం సన్నిధిలో చత్తీస్ ఘడ్ మంత్రి కవాసి లక్మావరంగల్ టైమ్స్, ములుగు జిల్లా: తాడ్వాయి మండలంలోని శ్రీ మేడారం సమ్మక్క సారలమ్మలను ఛత్తీస్ ఘడ్ మంత్రి కవాసి లక్మా దర్శించుకున్నారు. మంత్రి కవాసి లక్మా తో పాటు ములుగు ఎమ్మెల్యే సీతక్క వనదేవతలను దర్శించుకున్నారు.ఆసియాలోనే అతిపెద్ద మహాజాతర శ్రీ సమ్మక్క సారలమ్మలను దర్శించుకోవడం సంతోషకరంగా ఉందని కవాసి లక్మా అన్నారు. అనంతరం వనదేవతలకు ఎత్తు బంగారాన్ని సమర్పించారు. కోరిన కోర్కెలు తీర్చే వన దేవతల ఆశీస్సులు అందరికీ ఉండాలని ఆయన ప్రార్థించినట్లు తెలిపారు.

దీనికి ముందు మేడారం అమ్మవార్లను దర్శించుకునేందుకు వచ్చిన మంత్రి కవాసి లక్మాకు ఎమ్మెల్యే సీతక్క స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ కార్యదర్శి పైడాకుల అశోక్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇరుస వడ్ల వెంకన్న,ఆత్మ డైరెక్టర్ ఆకు తోట చంద్ర మౌళి, సర్పంచులు రేగ కల్యాణి, ఇరుప సునీల్, అర్రెమ్ లచ్చు పటేల్, తదితరులు పాల్గొన్నారు.