ఉక్రెయిన్ నుంచి సేఫ్ గా చేరుకున్న విద్యార్థులు
వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : ఉక్రెయిన్ నుంచి భారత్ కు వచ్చిన తెలుగు విద్యార్థులు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నారు. శనివారం రాత్రి బుకారెస్ట్ నుంచి ముంబై చేరుకున్న విమానంలో 219 మంది భారతీయులున్నారు. ఆ తర్వాత ఢిల్లీ వచ్చిన మరో విమానంలో 250 మంది విద్యార్థులున్నారు. బుడాపెస్ట్ నుంచి ఢిల్లీకి బయల్దేరిన విమానంలో 240 మంది భారతీయులున్నారు. ముంబై చేరుకున్న విమానంలో ఉన్న 20 మంది తెలుగు విద్యార్థులు శంషాబాద్ విమానాశ్రయంలో ల్యాండయ్యారు.భారత్ కు తమను సేఫ్ గా తీసుకొచ్చిన తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు , భారత ఎంబసీకి విద్యార్థులు ధన్యవాదాలు తెలిపారు. అలాగే ఢిల్లీ చేరిన విమానంలో 17 మంది తెలుగు విద్యార్థులు ఉన్నారు. ఈ రోజు సాయంత్రానికి మరికొంతమంది తెలుగు విద్యార్థులు ఢిల్లీ చేరుకుంటారని సమాచారం. శంషాబాద్ చేరుకున్న విద్యార్థులు భారత ఎంబసీకి, తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు కృతజ్ఞతలు తెలిపారు.