యూపీలో కొనసాగుతున్న 5వ దశ పోలింగ్

యూపీలో కొనసాగుతున్న 5వ దశ పోలింగ్

వరంగల్ టైమ్స్, ఉత్తర్ ప్రదేశ్  : యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా 5వ దశ పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. అవధ్, పూర్వాంచల్ ప్రాంతాల్లో విస్తరించి ఉన్న 12 జిల్లాల్లోని 61 నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతుండగా, మొత్తం 692 మంది అభ్యర్థులు తలపడుతున్నారు. 5వ దశలో డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య సహా పలువురు మంత్రులు పోటీలో ఉన్నారు.

యూపీలో కొనసాగుతున్న 5వ దశ పోలింగ్

దాదాపు 2.24 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ దఫా ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ప్రయాగ్ రాజ్, అమేఠీ, రాయ్ బరేలీ, అయోధ్య వంటి కీలక జిల్లాలున్నాయి. యూపీలో మొత్తం 403 శాసనసభ స్థానాలకు గాను 7 దశల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే 4 దశల్లో 231 స్థానాలకు పోలింగ్ పూర్తైంది. 5వ దశ ఎన్నికల పోలింగ్ నేడు కొనసాగుతుండగా మరో రెండు దశల పోలింగ్ మిగిలి ఉంది. మార్చి 3, 7 తేదీల్లో ఆ రెండు దశల పోలింగ్ జరుగనుంది. మార్చి 10న యూపీ ఎన్నికల ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడించనున్నారు.