పోలియో చుక్కలు వేయించడం తప్పనిసరి: దాస్యం

పోలియో చుక్కలు వేయించడం తప్పనిసరి : దాస్యం

వరంగల్ టైమ్స్, హనుమకొండ జిల్లా: పోలియో రహిత సమాజం కోసం ప్రతీ ఒక్కరు కృషి చేయాలని ప్రభుత్వ చీఫ్ విప్, స్థానిక ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. వడ్డేపల్లి యూపీహెచ్సి లో చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేసి జాతీయ పల్స్ పోలియో కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. 0-5 సంవత్సరాలలోపు పిల్లలకు తల్లిదండ్రులు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని చీఫ్ విప్ సూచించారు. రెండు చుక్కల మందు చిన్నారుల ఆరోగ్యకరమైన మంచి భవిష్యత్తుకు బాటలు వేస్తుందని, రేపటి నుంచి ఇంటింటికి తిరుగుతూ చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేస్తారని పేర్కొన్నారు.పోలియో చుక్కలు వేయించడం తప్పనిసరి: దాస్యం

హనుమకొండ నగర పరిధిలో దాదాపు 150 పల్స్ పోలియో సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగిందని దాస్యం వినయ్ భాస్కర్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా దాదాపు 79226 మంది చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేయనున్నారని, జిల్లా వ్యాప్తంగా 1984 మంది ఉద్యోగులు పల్స్ పోలియో కార్యక్రమంలో పనిచేయనున్నట్లు వెల్లడించారు. బస్టాండ్ మరియు రైల్వే స్టేషన్ దగ్గర 24 గంటల పాటు పల్స్ పోలియో సేవలు అందుబాటులో ఉంటాయన్నారు.