మంత్రి సత్యవతి రాథోడ్ కు కేటీఆర్ పరామర్శ

మంత్రి సత్యవతి రాథోడ్ కు కేటీఆర్ పరామర్శ

వరంగల్ టైమ్స్, మహబూబాబాద్ జిల్లా: రాష్ట్ర గిరిజన, స్త్రీ-శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ తండ్రి లింగ్యా నాయక్ పదిరోజుల క్రితం మహబూబాబాద్ జిల్లా కురవి మండలం పెద్ద తండాలో హఠాన్మరణం చెందడంతో నేడు మంత్రులు రాష్ట్ర మున్సిపల్, ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణావృద్ధిశాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పరామర్శించారు. లింగ్యానాయక్ చిత్రపటానికి మంత్రి కేటీఆర్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మంత్రి సత్యవతి రాథోడ్ ను ఓదార్చారు. ఆయన మృతి పట్ల సంతాపం తెలిపారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థించారు. అంతకు ముందు మంత్రి కేటీఆర్ రోడ్డు మార్గాన మరిపెడ మీదుగా పెద్ద తండాకు చేరుకోగా అడుగడుగునా పార్టీ కార్యకర్తలు, అభిమానులు, ఎమ్మెల్యేలు స్వాగతం పలికారు.మంత్రి సత్యవతి రాథోడ్ కు కేటీఆర్ పరామర్శ