ఏబీసీ బ్యూటీ పార్లర్ సేవలు ప్రారంభం

ఏబీసీ బ్యూటీ పార్లర్ సేవలు ప్రారంభం

వరంగల్ టైమ్స్, హనుమకొండ జిల్లా : మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడే తమ కుటుంబంతో పాటు సమాజం మరింత మెరుగుపడుతుందని సెలూన్ అసోసియేషన్ అధ్యక్షుడు నాగవెల్లి సురేష్ కుమార్ అన్నారు. మహిళలు ఆర్థికంగా ఎదగడానికి స్వయం ఉపాధి మార్గాలను ఎంచుకోవడం చాలా మంచిదని నాగవెల్లి సురేష్ కుమార్ సూచించారు. హనుమకొండ కిషన్ పుర మెయిన్ రోడ్డు నందు ఏర్పాటు చేసిన ఏబీసీ లేడీస్ బ్యూటీ పార్లర్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా నాగవెల్లి సురేష్ కుమార్, 61వ డివిజన్ కార్పొరేటర్ ఎలకంటి రాములు హాజరయ్యారు. కిషన్ పుర మెయిన్ రోడ్డు నందు ఉన్నఏబీసీ లేడీస్ బ్యూటీ పార్లర్ ను ఎలకంటి రాములు, నాగవెల్లి సురేష్ కుమార్ ప్రారంభించారు. అనంతరం బ్యూటీపార్లర్ ను ప్రారంభించిన ముఖ్యఅతిథులను నిర్వహకులు శాలువాలతో సత్కరించారు.ఏబీసీ బ్యూటీ పార్లర్ సేవలు ప్రారంభం

మహిళలు స్వయం ఉపాధి పొందడం మరియు తోటి మహిళలకు ఉపాధి కల్పించడం గొప్ప విషయమని కార్పొరేటర్ ఎలకంటి రాములు, నాగవెల్లి సురేష్ కుమార్ అన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా వృత్తిలో రాణించాలని వారు ఆకాంక్షించారు. అంతేకాకుండా స్వయం ఉపాధి కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ఉపయోగించుకోవాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు జంపాల ప్రశాంత్, ప్రవీణ్,సెలూన్ అసోసియేషన్ బాధ్యులు శ్రీరాముల నరేందర్, సింగారపు శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.ఏబీసీ బ్యూటీ పార్లర్ సేవలు ప్రారంభం