హేర్ కటింగ్ చేయనందుకు భౌతిక దాడి చేశారు

హేర్ కటింగ్ చేయనందుకు భౌతిక దాడి చేశారు

వరంగల్ టైమ్స్, హనుమకొండ జిల్లా : సెలూన్ షాపులో పనిచేసే వ్యక్తిని ఇద్దరు యువకులు దాడి చేసిన ఘటన హనుమకొండ నయీంనగర్ లో చోటు చేసుకుంది. సమయం ముగిసింది హేర్ కట్టింగ్ చేయలేనని చెప్పడంతో మండిపడిన ఆ యువకులు సెలూన్ షాప్ లో పనిచేసే వ్యక్తిపై చేయి చేసుకున్నారు. హేర్ కటింగ్ చేయనందుకు భౌతిక దాడి చేశారుఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హనుమకొండ పోలీసులు, బాధితుడు తెల్పిన వివరాల ప్రకారం, హనుమకొండకు చెందిన రంజిత్ అనే వ్యక్తి నయీంనగర్ లోని రెయాన్స్ మెన్స్ బ్యూటీపార్లర్ లో పనిచేస్తున్నాడు.

డిసెంబర్ 30న రాత్రి 10.00 గంటల తర్వాత పని ముగించుకుని షాపును మూసివేస్తూ ఇంటికి వెళ్లడానికి సిద్దమయ్యాడు. అదే సమయానికి ఎండీ బాదర్, బష్కె అఖిల్ అనే ఇద్దరు యువకులు షాపులోకి వచ్చారు. తమకు కటింగ్ చేయాలని డిమాండ్ చేశారు.

సమయం ముగిసిందని ఇంటికి వెళ్తున్నాని చెస్సడంతో కోపోద్రిక్తులైన ఇద్దరు వ్యక్తులు రంజిత్ పై భౌతిక దాడికి దిగారు. దీంతో రంజిత్ కు ఏం చేయాలో తోచక పెద్దగా అరుస్తూ తప్పించుకునే ప్రయత్నం చేశాడు. రంజిత్ స్పృహతప్పి పడిపోవడంతో ఇద్దరు యువకులు అక్కడి నుంచి పారిపోయారు.

కొంత సమయానికి తేరుకున్న రంజిత్ ఇంటికి వెళ్లాడు. శనివారం రోజు ఉమ్మడి వరంగల్ జిల్లా నాయీబ్రాహ్మణ సంఘం నాయకులతో కలిసి హనుమకొండ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు అక్కడి సీసీ కెమెరాల ఆధారంగా ఇద్దరిని గుర్తించారు. సోమవారం ఆ యువకులిద్దరిని అదుపులోకి తీసుకుని విచారించినట్లు చెప్పారు. ఇద్దరిలో ఒకరిపై రౌడీషీట్ ఓపెన్ చేయనున్నట్లు పోలీసులు వెల్లడించారు.