ఉత్తమ క్రికెటర్ల జాబితా రిలీజ్ చేసిన బీసీసీఐ 

ఉత్తమ క్రికెటర్ల జాబితా రిలీజ్ చేసిన బీసీసీఐ

వరంగల్ టైమ్స్ , స్పోర్ట్స్ డెస్క్ : ఈ సంవత్సరం మూడు ఫార్మాట్లలో ఉత్తమంగా రాణించిన ప్లేయర్ల జాబితాను శనివారం బీసీసీఐ రిలీజ్ చేసింది. బ్యాటింగ్, బౌలింగ్ లో అద్భుత ప్రదర్శన చేసిన క్రికెటర్ల పేర్లను ప్రకటించింది. టెస్టు క్రికెట్ లో అదరగొట్టిన వాళ్లలో వికెట్ కీపర్ రిషభ్ పంత్, సీనియర్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా అగ్రస్థానంలో ఉన్నారు. ఈ సంవత్సరం 7 టెస్టు మ్యాచ్ లు ఆడిన పంత్ 680 రన్స్ సాధించాడు. వీటిలో 2 సెంచరీలు, 4 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. భారత బౌలర్లలో బుమ్రా ఈ సంవత్సరం అత్యధిక వికెట్లు పడగొట్టాడు. 5 టెస్టుల్లో 20.31 సగటుతో 22 వికెట్లుే తీశాడు. రెండుసార్లు 5 వికెట్ల ప్రదర్శన చేశాడు.ఉత్తమ క్రికెటర్ల జాబితా రిలీజ్ చేసిన బీసీసీఐ *టీ 20 క్రికెట్ లో – సూర్యకుమార్ యాదవ్ ఉత్తమ ఇండియన్ ప్లేయర్ గా ఎంపికయ్యాడు. టీ20 వరల్డ్ కప్, న్యూజిలాండ్ సిరీస్ లో తన ట్రేడ్ మార్క్ షాట్లతో విరుచుకుపడిన అతను ఈ సంవత్సరం 31 మ్యాచుల్లో 1,164 రన్స్ చేశాడు. ఈ ఫార్మాట్ లో ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడిన అతను 2022లో 2 సెంచరీలు, 9 హాఫ్ సెంచరీలు బాదాడు. సీనియర్ పేసర్ భువనేశ్వర్ బెస్ట్ బౌలర్ గా సెలక్ట్ అయ్యాడు. 32 టీ 20ల్లో భువీ 37 వికెట్లు పడగొట్టాడు.

*వన్డే ఫార్మాట్ లో – మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ టాప్ స్కోరర్ గా నిలిచాడు. 17 మ్యాచ్ లు ఆడిన అయ్యర్ 55.69 సగటుతో 724 రన్స్ చేశాడు. ఇందులో 6 హాఫ్ సెంచరీలున్నాయి. ఇక బౌలింగ్ లో మొహమ్మద్ సిరాజ్ ఈ సంవత్సరం ఆకట్టుకున్నాడు. 15 మ్యాచుల్లో అతను 24 వికెట్లు తీశాడు.