ప్రధానిపై టీఆర్ఎస్ ప్రివిలేజ్ మోషన్

ప్రధానిపై టీఆర్ఎస్ ప్రివిలేజ్ మోషన్వరంగల్ టైమ్స్, న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ ఎంపీలు రాజ్యసభ చైర్మన్ కు ఫిర్యాదు చేశారు. సభా హక్కుల ఉల్లంఘన కింద రాజ్యసభ సెక్రెటరీ జనరల్ కు నోటీసులు అందచేశారు. 187వ నిబంధన కింద టీఆర్ఎస్ ఎంపీలు కే.కేశవరావు, సంతోష్, లింగయ్య యాదవ్, సురేశ్ రెడ్డి నోటీస్ ఇచ్చాడు. తెలంగాణ బిల్లుపై ప్రధాని అభ్యంతరకరంగా మాట్లాడారని అందులో పేర్కొన్నారు.

తలుపులు మూసేసి తెలంగాణ బిల్లును ఆమోదింపచేశారని మాట్లాడటం రాజ్యాంగాన్ని అవమానించడమేనని నోటీసులో పేర్కొన్నారు. పార్లమెంట్ లో పాస్ అయిన బిల్లును అవహేళన చేయడం సరికాదని తెలిపారు. పార్లమెంట్ ను, సభాపతులను అవమానపరిచేలా ప్రధాని వ్యాఖ్యలు వున్నాయని పేర్కొన్నారు. ఇది సభా హక్కులను ఉల్లంఘించడమే అవుతుందని వెల్లడించారు.