వరంగల్ టైమ్స్, నిర్మల్ జిల్లా: నిర్మల్ పట్టణంలోని చింతకుంట వాడ శ్రీ ఆంజనేయ శివ పంచాయతన నవగ్రహ దేవాలయ తృతీయ వార్షికోత్సవానికి గురువారం రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హాజరయ్యారు. ఆంజనేయ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు మంత్రికి పూజారులు పూర్ణ కుంభం, మహిళలు మంగళ హారతులతో స్వాగతం పలికారు. గత 4 రోజుల నుండి ఆలయం లో ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. చింతకుంట వాడ దేవాలయం నిర్మల్ పట్టణంలో చాలా పురాతన దేవాలయమని మంత్రి అన్నారు. రూ30 లక్షలతో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఆలయాన్ని పునర్నిర్మాణం చేశామని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, స్థానిక కౌన్సిలర్లు గండ్రత్ రమణ, అడ్ప విజయలక్ష్మి పోశెట్టి, కాంట్రాక్టర్ జగన్మోహన్ రెడ్డి, నాయకులు గండ్రత్ రమేష్, అయ్యప్ప ఆలయ గురుస్వామి పి ఎన్ మూర్తి, మెంగ రమేష్, ఆలయ అధ్యక్షుడు డి ఎస్ రాజేశ్వర్,మెంగ రాములు, కందుల రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.