నేటితో శుభం కార్డు పడుతుంది: చిరంజీవి

నేటితో శుభం కార్డు పడుతుంది: చిరంజీవి

వరంగల్ టైమ్స్, అమరావతి: ఏపీలో సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలకు ఈ రోజు శుభం కార్డు పడుతుందని ప్రముఖ సినీ నటుడు చిరంజీవి అన్నాడు. ఏపీ సీఎం జగన్ తో చర్చించేందుకు హైదరాబాద్ లోని బేగంపేట నుంచి విమానంలో చిరంజీవి విజయవాడకు బయల్దేరారు. చిరంజీవితో పాటు మహేశ్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, రాజమౌళి, కొరటాల శివ, ఇతర సినీ ప్రముఖులు ఏపీ సీఎం జగన్ తో సమావేశం కానున్నారు. సీఎంతో అన్ని విషయాలు చర్చించిన తర్వాతే చర్చల అంశాలను వెళ్లడిస్తానని చిరంజీవి పేర్కొన్నారు. నేటితో ఈ సమస్యకు ఎండ్ కాదు, శుభం కార్డు పడుతుందని వెల్లడించారు.

ఆంధ్రప్రదేశల్ లో గత కొన్నినెలలుగా సినిమా టికెట్ల ధరల తగ్గింపుతో పాటు ఇతర సినీ సమస్యలపై సినీ పరిశ్రమలోని ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే సినీ పరిశ్రమ సమస్యలపై మంత్రి పేర్నినాని, సంబంధిత అధికారులతో సీఎం జగన్ సమావేశమై చర్చించారు.