పిల్లల కోవిడ్ విభాగాన్ని ప్రారంభించిన హరీష్ రావు

పిల్లల కోవిడ్ విభాగాన్ని ప్రారంభించిన హరీష్ రావువరంగల్ టైమ్స్ , వరంగల్ జిల్లా: వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ లో ఏర్పాటు చేసిన పిల్లల కోవిడ్ ప్రత్యేక సంరక్షణ విభాగాన్ని రాష్ట్ర ఆర్ధిక, వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖా మంత్రి తన్నీరు హరీష్ రావు ప్రారంభించారు. మంత్రి హరీష్ రావు వెంట రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, రాష్ట్ర గిరిజనాభివృద్ధి , శిశు సంక్షేమ శాఖా మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీ పసునూరి దయాకర్, చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, నగర మేయర్ గుండు సుధారాణి, జెడ్పీ చైర్ పర్సన్ గండ్ర జ్యోతి, ఎమ్మెల్యేలు నన్నపునేని నరేందర్, శంకర్ నాయక్, ఆరూరి రమేష్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్యలు పాల్గొన్నారు. వీరితో పాటు వరంగల్ జిల్లా కలెక్టర్ గోపీ, డిఎంహెచ్ఓ వెంకటరమణ, ఎంజీఎం సూపరింటెండెంట్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.