బీజేపీలో విలీనం కానున్న యువ తెలంగాణ పార్టీ !

బీజేపీలో విలీనం కానున్న యువ తెలంగాణ పార్టీ !

వరంగల్ టైమ్స్,హైదరాబాద్ : ఈ నెల 16న తమ పార్టీని బీజేపీలో విలీనం చేయనున్నట్లు ఆ పార్టీ నేత జిట్టా బాలకృష్ణారెడ్డి, రాణి రుద్రమ దేవి లు తెలిపారు. తమ పార్టీలో చేరాలంటూ కాంగ్రెస్ , బీజేపీలు ఒత్తిడి తీసుకురాగా, ఆయన బీజేపీ వైపే మొగ్గు చూపారు.

బీజేపీలో విలీనం కానున్న యువ తెలంగాణ పార్టీ !యువ తెలంగాణ పార్టీ విలీనానికి అంగీకారం తెలుపుతూ బీజేపీ జాతీయ నాయకత్వానికి ఆయన గతంలోనూ లేఖ పంపించారు. ఆయనతో పాటు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రాణీ రుద్రమ సైతం కాషాయం కండువా కప్పుకోనున్నారు. ఈనెల 16న యువ తెలంగాణ పార్టీ విలీనం ఉంటుందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ సోమవారం వెల్లడించారు.