ట్యాంకర్ పేలి నలుగురు మృతి

వరంగల్ టైమ్స్, సూర్యాపేట జిల్లా : సూర్యాపేట జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. సూర్యాపేటలో గ్యాస్ ట్యాంకర్ పేలి ఇద్దరు మృతి చెందారు. స్థానిక కొత్త బస్టాండ్ వద్ద గల హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి సర్వీస్ రోడ్డు వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ట్యాంకర్ కు వెల్డింగ్ చేస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరు గాయాలపాలయ్యారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.