షేక్ సాదియాను అభినందించిన ముత్తం శెట్టి

షేక్ సాదియాను అభినందించిన ముత్తం శెట్టివరంగల్ టైమ్స్ , అమరావతి : పవర్ లిప్టర్ షేక్ సాదియా అల్మాస్ ను రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజన శాఖ మంత్రి ముత్తం శెట్టి శ్రీనివాసరావు అభినందించారు. గత యేడాది డిసెంబర్ చివరి వారంలో టర్కీలోని ఇస్తాన్బుల్ నగరంలో జరిగిన ఆసియా పవర్ లిప్టింగ్ ఛాంపియన్ షిప్-2021లో రాష్ట్రం నుండి పాల్గొని పవర్ లిప్టర్ షేక్ సాదియా అల్మాస్ మూడు స్వర్ణ, ఒక వెండి పథకాన్ని సాధించింది. ఈ నేపథ్యంలో పవర్ లిప్టర్ షేక్ సాదియా అల్మాస్ సోమవారం రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజన శాఖ మంత్రి ముత్తం శెట్జి శ్రీనివాసరావును సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

2017 నుండి పవర్ లిప్టింగ్ పోటీల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తాను ఇంతవరకూ సాధించిన విజయాలను, పథకాలను మంత్రికి వివరించారు. పవర్ లిప్టింగ్ లో మూడు స్వర్ణ పథకాలను సాదించి స్ట్రాంగ్ ఉమెన్ ఆఫ్ ఏసియాగా నిలిచిన సాదియా అల్మాస్ ను మంత్రి అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని పథకాలను సాధించి దేశానికి, రాష్ట్రానికి మంచి పేరు తేవాలని కోరారు. ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా ప్రోత్సహిస్తామని భరోసా ఇచ్చారు. వైఎస్సార్ క్రీడా పురస్కారాల్లో భాగంగా రూ.5.00 లక్షల నగదు బహుమతిని వెంటనే ఆమెకు అందేలా చర్యలు తీసుకోవాలని క్రీడా శాఖా అధికారులను మంత్రి ఆదేశించారు. రాష్ట్ర క్రీడల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సాయిప్రసాద్, కోచ్ షేక్ సందాని ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.