ఆర్థిక ఇబ్బందులతో ముగ్గురు ఆత్మహత్య

వరంగల్ టైమ్స్ , కరీంనగర్ జిల్లా : కరీంనగర్ జిల్లాలోని చొప్పదండి మండలం కాట్నపల్లిలో విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతులు శంకరయ్య( 55), జమున (50), శ్రీధర్ గా గుర్తించారు. ఆత్మహత్యకి ఆర్థిక ఇబ్బందులే కారణమని స్థానికుల సమాచారం. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.