ఇంటర్ విద్యార్థిని నాగజ్యోతి ఆత్మహత్య !
వరంగల్ టైమ్స్, హనుమకొండ జిల్లా : నక్కలగుట్టలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థిని నాగజ్యోతి ఆత్మహత్య చేసుకుంది. సువిద్య జూనియర్ కాలేజీలో ఈ ఘటన జరిగింది. సువిద్య జూనియర్ కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న నాగజ్యోతి నిన్న ఉదయం అందరిలాగానే పరీక్షకు హాజరైంది. అయితే పరీక్ష సరిగా రాసానో లేదో అనే అనుమానంతో హాస్టల్ లో రాత్రి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. హాస్టల్ నాగజ్యోతి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించడాన్ని గమనించిన తోటి విద్యార్థులు, యాజమాన్యం వెంటనే ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అయితే ఎంజీఎంలో చికిత్స పొందుతూ నాగజ్యోతి మృతి చెందినట్లు సమాచారం. విద్యార్థిని స్వస్థలం జనగామ జిల్లా కొడకండ్ల మండలం ఏడునూతుల గ్రామం.