సామాన్యులపై మరోసారి ‘బండ బాదుడు’

సామాన్యులపై మరోసారి ‘బండ బాదుడు’

సామాన్యులపై మరోసారి 'బండ బాదుడు'వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : వంట గ్యాస్ వినియోగదారులపై మరోసారి ఆర్థికభారం పడింది. గ్యాస్ ధరలను పెంచుతూ పెట్రోలియం సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. గృహ వినియోగానికి ఉపయోగించే గ్యాస్ సిలిండర్ పై రూ. 50, వాణిజ్య సిలిండర్ పై రూ. 350.50 లు పెంచారు. పెరిగిన ధరలు నేటి నుంచే ( మార్చి 1 ) అమల్లోకి వచ్చాయి.

ఫిబ్రవరి 28 వరకు గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధర హైదరాబాద్ లో రూ.1,105 ఉండగా తాజా పెంపుతో అది రూ.1,155 అయింది. వాణిజ్య సిలిండర్ ధర ఢిల్లీలో రూ. 2119.50 కు పెరిగింది. ఇప్పటికే నిత్యావసర సరుకుల ధరల పెంపుతో సామాన్య, మధ్యతరగతి ప్రజల నడ్డీ విరుగుతోంది. తాజాగా పెరిగిన గ్యాస్ ధరలతో ఆ భారం మరింత పెరగనుంది.