గ్రూప్-2 పరీక్షా తేదీలను ప్రకటించిన టీఎస్పీఎస్సీ 

గ్రూప్-2 పరీక్షా తేదీలను ప్రకటించిన టీఎస్పీఎస్సీ

వరంగల్ టైమ్స్, ఎడ్యుకేషన్ డెస్క్ : గ్రూప్-2 పరీక్షా తేదీలను టీఎస్పీఎస్సీ మంగళవారం ప్రకటించింది. ఆగస్టు 29, 30 తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. పరీక్షకు వారం ముందు నుంచి అభ్యర్థులు హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవచ్చని వివరించింది. 783 పోస్టుల కోసం గత యేడాది డిసెంబర్ 29న టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే జనవరి 18 నుంచి దరఖాస్తులు స్వీకరించింది. గ్రూప్-2 ఉద్యోగాల కోసం 5,51,943 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కో పోస్టుకు 705 మంది దరఖాస్తు చేసుకున్నారు.