రిజర్వేషన్లు ఎత్తివేసేందుకు కేంద్రం కుట్ర

రిజర్వేషన్లు ఎత్తివేసేందుకు కేంద్రం కుట్ర

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ ​ : కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఎస్సీ ,ఎస్టీ ,బీసీ మైనార్టీల పట్ల వివక్షత చూపుతూ రిజర్వేషన్లు ఎత్తివేసేందుకు కుట్ర చేస్తోందని ఎస్సీ కార్పొరేషన్​ మాజీ చైర్మన్ పిడమర్తి రవి అన్నారు. ఆదివారం సోమాజిగూడ ప్రెస్​క్లబ్​లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.​ విద్య సంస్థల్లో ఐఐటీ లో రిజర్వేషన్లను ఎత్తివేసేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని ఆరోపించారు.రిజర్వేషన్లు ఎత్తివేసేందుకు కేంద్రం కుట్రగోపాలరావు (ఢిల్లీ ఐఐటీ డైరెక్టర్ ) ఆధ్వర్యంలో కమిటీ వేసి కేంద్రీయ విద్య సంస్థలు, ఐఐటీ లాంటి విద్యా సంస్థల్లో టీచర్ రిక్రూట్​మెంట్​లో CEI Act -2019 Section- 4లో ఐఐటీ లను చేర్చాలని వాటిలో రిజర్వేషన్లు ఎత్తివేయాలని రికమాండ్ చేసిందన్నారు. 2015 బీహార్​ ఎన్నికల సందర్భంగా ఆర్​ఎస్ఎస్​​ చీఫ్ మోహన్ భగవత్ రిజర్వేషన్లు ఇంక ఎన్నాళ్లు ? వాటిని ఎవర్ని బలి చేసి కొనసాగిస్తారు అని అన్నారని విమర్శించారు.

దీనిని బట్టి మొదటి నుంచి ఆర్​ఎస్​ఎస్​, బీజేపీలు రిజర్వేషన్లను వ్యతిరేకిస్తున్నాయని అర్థమవుతుందని ఎద్దేవా చేశారు. నీట్​ (మెడికల్ ప్రవేశ పరీక్ష) ఇచ్చే కోటా లో బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వడం లేదని దీని వల్ల 10వేల ఎంబీబీఎస్​ సీట్లను బీసీలు కోల్పోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ లకు పొలిటికల్ రిజర్వేషన్లు కల్పించడం కోసం పార్లమెంట్ లో ఎందుకు చట్టం చేయడం లేదని పిడమర్తి ప్రశించారు. ఈ సమావేశంలో ఆయన వెంట నాయకులు ఉన్నారు.